
పసిడి కంటే పిరం
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.10 వేలకు పైగా ఉంది. దీన్ని మించి నగరంలోని రిటైల్ మార్కెట్‌లో గ్రాము కొకై న్ రూ.25 వేలు పలుకుతోంది. ముంబై నుంచి ఈ మాదక ద్రవ్యాన్ని తీసుకువచ్చి సిటీలో విక్రయిస్తున్న డ్రగ్ పెడ్లర్ మోహిత్ సంజయ్ మెహ్రాను హెచ్–న్యూ పోలీసులు పట్టుకున్నారు. ఇతడితో పాటు ఓ వినియోగదారుడినీ అరెస్టు చేసి వీరి నుంచి 15 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నట్లు గురువారం టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర వెల్లడించారు. ముంబైకి చెందిన మోహిత్ అక్కడే మెకానికల్ విభాగంలో బీటెక్ పూర్తి చేశాడు. ఆపై సొంతంగా వ్యాపారం ప్రారంభించి.. దాని విస్తరణలో భాగంగా 2021లో భార్యతో సహా నగరానికి వలస వచ్చి నార్సింగిలో స్థిరపడ్డాడు. కొన్నాళ్ల క్రితం భార్య విడాకులు ఇవ్వడంతో మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడ్డాడు. స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు పబ్స్‌లో గడపడం మొదలెట్టిన ఇతగాడు డ్రగ్స్‌కు బానిసగా మారాడు. కొన్నాళ్లకు డ్రగ్ పెడ్లర్‌గా మారిన మోహిత్ అలా వచ్చే డబ్బుతో జల్సాలు చేయడంతో పాటు విలాసవంతమైన జీవితం గడిపేవాడు. ముంబైకి చెందిన సప్లయర్స్ నుంచి కొకై న్ ఖరీదు చేసుకువచ్చేవాడు. నేరుగా అక్కడకు వెళ్లి గ్రాము కొకై న్ రూ.10 వేలకు ఖరీదు చేస్తున్న మోహిత్ నగరానికి తీసుకువచ్చి గ్రాము రూ.25 వేలకు అమ్ముతున్నాడు. ఇతడి వ్యవహారాలపై హెచ్–న్యూ ఇన్‌స్పెక్టర్ ఎస్.బాలస్వామికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సై బి.మనోజ్ కుమార్ బృందం లంగర్‌హౌస్ ప్రాంతంలో వలపన్ని పట్టుకుంది. ఇతడి నుంచి కొకై న్ ఖరీదు చేస్తున్న పద్మారావునగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి నాగారం జాన్ రాజ్‌ను అరెస్టు చేసింది. నిందితులతో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న కొకై న్‌నూ తదుపరి చర్యల నిమిత్తం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించింది. నగరంలో డ్రగ్స్ క్రయవిక్రయాలపై సమాచారం తెలిస్తే 87126 61601కు ఫోన్ చేసి చెప్పాలని, వీరి వివరాలు పూర్తి గోప్యంగా ఉంటాయని డీసీపీ సుధీంద్ర పేర్కొన్నారు.
రిటైల్‌గా గ్రాము కొకై న్ రూ.25 వేలు
ముంబైలో రూ.10వేలకు కొని నగరంలో విక్రయం
పెడ్లర్‌ను అరెస్టు చేసిన హెచ్–న్యూ టీమ్