
ప్రాణం తీసిన ట్రాన్స్‌ఫార్మర్
కేపీహెచ్‌బీకాలనీ: సరదాగా ఇంటి ఆవరణలో ఇద్దరు బాలురు షటిల్ ఆడుతుండగా..షటిల్ కాక్ వెళ్లి ట్రాన్స్‌పార్మర్‌పై పడింది. ఓ బాలుడు షటిల్ బ్యాట్‌తో కాక్‌ను తీసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని బాపట్లకు ప్రాంతానికి చెందిన కొత్తూరు ప్రేమ్ కుమార్ భగత్‌సింగ్ నగర్‌లోని పయనీర్ ప్రివిలేజ్ అపార్టుమెంట్‌లో నివాసం ఉండే తన బావ ఇంటికి వచ్చాడు. ప్రేమ్‌కుమార్ కుమారుడు విజయ్ కార్తీక్ (14), ప్రేమ్‌కుమార్ బావ కుమారుడితో కలిసి అపార్టుమెంట్ ప్రహరీ లోపల సరదాగా షటిల్ ఆడుకుంటున్నారు. ఇదే క్రమంలో షటిల్ కాక్ వెళ్లి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దీంతో విజయ్ కార్తీక్ తన చేతిలో ఉన్న షటిల్ బ్యాట్‌తో కాక్‌ను తీసేందుకు యత్నించగా పెద్ద శబ్దంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
షటిల్ కాక్ తీసేందుకు ప్రయత్నించి..
విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి