
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై జడ్చర్లలోని మాచారం ఫ్లైఓవర్‌పై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో బస్సు డ్రైవర్ ఇద్దరు మహిళలున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులున్నారు.
ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ప్రేవేట్ ట్రావెల్స్ బస్సు మితిమీరిన వేగం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.