
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘రెడ్ బుల్ సోప్‌బాక్స్ రేస్’ మూడో ఎడిషన్‌కు హైదరాబాద్ నగరం వేదికగా మారనుంది. బెల్జియం, స్పెయిన్, ఇటలీ, యూకే, యూఎస్‌ఏ, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలతో ప్రసిద్ధ రేసులను నిర్వహించిన రెడ్ బుల్ సోప్‌బాక్స్ రేస్ మార్చ్ 3న నగరంలోని రామానాయుడు స్టూడియోస్, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్‌లో సాయంత్రం 5 గంటలకు జరగనుంది. గతంలో జరిగిన రెండు ఎడిషన్లకు ముంబై వేదిక కాగా ఈ సారి నగరంలో నిర్వహించనున్నారు. ఈ రేసు కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 3300 రిజిస్ట్రేషన్‌ల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన 30 టీమ్‌లు మాత్రమే వారి ప్రత్యేక వాహనాలతో దూసుకుపోనున్నారు. ఈ రేసుల్లో పాల్గొనే వారు సృజనాత్మకతతో నిర్మించుకున్న నాన్–మోటరైజ్డ్ సోప్ బాక్స్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ రేసింగ్ కార్యక్రమాల్లో కులు బాజీ, రోహన్ జోషి, సాహిబా బాలి, జోర్డిండియన్ అని పిలుచుకునే ఆదిత్య కులశ్రేష్ఠ్ వంటి క్రియేటివ్ హోస్ట్‌లు సందడి చేయనున్నారు. అంతేకాకుండా ప్రముఖ చెస్ ప్లేయర్ తానియా సచ్‌దేవ్, భారత హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్, హాకీ ప్రాడిజీ లాల్‌రెమ్సియామి, డాకర్ ర్యాలీ 2 ఛాంపియన్ హరిత్ నోహ్ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నట్లు నిర్వాహాకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రేసుల్లో ఎస్8యూఎల్ గేమింగ్, గాడ్‌లైక్ గేమింగ్, టెక్నో గేమర్జ్, జోస్ కోవాకో, జెర్క్స్, ఆర్ట్ గై రాబ్ వంటి ప్రముఖ క్రియేటర్‌లు తమ సొంత కార్ట్‌లలో వాలుపై పరుగెత్తుతున్నారు. ఈ రేసుకు సంబంధించిన టిక్కెట్లు https://in. bookmyshow.com/sports/red&bull&soapbox&race/ET00385383 లో అందుబాటులో ఉంటాయని, ప్రత్యక్షంగా వీక్షించలేని రేసింగ్ అభిమానులు జియో టీవీలో రెడ్ బుల్ సోప్‌బాక్స్ రేస్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చని తెలిపారు.
మార్చ్ 3న రామానాయుడు స్టూడియోస్, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్‌లో రేస్..