అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గోల్డ్‌ ఏటీఎం | Sakshi
Sakshi News home page

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గోల్డ్‌ ఏటీఎం

Published Sat, Dec 30 2023 5:52 AM

- - Sakshi

హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు గోల్డ్‌ ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల సౌకర్యార్ధం ‘గోల్ట్‌ సిక్కా’ కంపెనీ అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో శుక్రవారం మొదటి గోల్డ్‌ ఏటీఎం కంపెనీ సీఈఓ తరుజ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వెర్షన్‌తో ఏటీఎం నుండి కొనుగోలుదారు వీలును బట్టి గోల్డ్‌ లేదా సిల్వర్‌ కాయిన్స్‌ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.

డెబిట్‌, క్రెడిట్‌, యూపీఐ ద్వారా కొనుగోలు చేసుకునే వీలుందని చెప్పారు. త్వరలో మన దేశంతో పాటు విదేశాల్లో 2 వేల నుంచి 3 వేల ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రష్యా, అమెరికా వంటి దేశాల నుండి ఆర్డర్లు వస్తున్నాయని వివరించారు. వైజాగ్‌లోని బ్యూటీ వరల్డ్‌ ఏ సంస్థతో మొదటి ఏటీఎంకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి, సినీ నటుడు అనంత్‌, సంస్థ ప్రతినిధులు అంబికా బర్మన్‌, ఫణి ప్రతాప్‌, యుగ టెక్నాలజీ ప్రతినిధి డా.ప్రవీణ్‌ పాల్గొన్నారు. – అమీర్‌పేట

Advertisement
 
Advertisement
 
Advertisement