సోలార్‌ సైకిల్‌ ట్రాక్‌ అదరహో | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ సైకిల్‌ ట్రాక్‌ అదరహో

Sep 18 2023 6:42 AM | Updated on Sep 18 2023 8:36 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ పర్యావరణవేత్త, యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌ సోలిమ్‌ ఆదివారం ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని సైకిల్‌ ట్రాక్‌ను హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. తెలంగాణ డైనమిక్‌ లీడర్‌ కేటీఆర్‌ నేతృత్వంలో అద్భుతమైన సోలార్‌ సైకిల్‌ ట్రాక్‌ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.

ట్రాక్‌పైన కొద్ది సేపు సైకిల్‌ తొక్కారు. దక్షిణ కొరియాలోని సైకిల్‌ ట్రాక్‌ తరహాలో ఇక్కడ ఏర్పాటు కావడం సంతోషమని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. నార్సింగ్‌ నుంచి కొల్లూరు వరకు రెండు విభాగాలుగా మొత్తం 23 కిలోమీటర్ల అధునాత సోలార్‌ సైకిల్‌ ట్రాక్‌ను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఈ ట్రాక్‌ వద్ద పార్కింగ్‌ సదుపాయంతో పాటు సైకిళ్లు అద్దెకు లభిస్తాయి. అలాగే కెఫెటేరియా వంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement