‘హాయ్‌ బావా.. నేను నచ్చితే వీడియో కాల్‌ మాట్లాడూ’ | - | Sakshi
Sakshi News home page

‘హాయ్‌ బావా.. నీ మరదలు లాంటిదాన్ని.. నచ్చితే వీడియో కాల్‌ మాట్లాడూ.. ప్లీజ్‌’

Jun 21 2023 6:40 AM | Updated on Jun 21 2023 7:55 AM

- - Sakshi

20 ఏళ్ల అందమైన యువతి ఫోన్‌ చేసి బావా అని పిలవడంతో అత్యాశకు పోయిన అతను

హిమాయత్‌నగర్‌: ‘హాయ్‌ జీజూ (బావ) నేను నీ మరదలు లాంటిదానిని. నేను నచ్చితే నాతో వీడియో కాల్‌ మాట్లాడు ప్లీజ్‌’ అంటూ 79 ఏళ్ల వృద్ధుడిని నిండా ముంచిందో సైబర్‌ కిలాడీ. 20 ఏళ్ల అందమైన యువతి ఫోన్‌ చేసి బావా అని పిలవడంతో అత్యాశకు పోయిన అతను రూ. లక్షలు పోగొట్టుకున్నాడు. మరిన్ని లక్షలు కావాలంటూ డిమాండ్‌ చేయడంతో పాటు వీడియోను బంధువులకు పంపిస్తానంటూ బెదిరింపులకు దిగడంతో తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన 79 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగికి ఇటీవల ఓ అమ్మాయి గొంతుతో ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీరు నా బావ లాంటి వారు, మీతో మాట్లాడాలని ఉందనడంతో అతను ఆమెతో మాటలు కలిపాడు. రెండు గంటల్లోనే వీడియో కాల్‌ ద్వారా పరిచయమయ్యారు. వృద్ధుడిని బాత్‌రూమ్‌లోకి రప్పించిన కిలాడీ ‘ఐ లవ్యూ’ అంటూ న్యూడ్‌ వీడియోను రికార్డ్‌ చేసింది.

పది నిమిషాల తర్వాత డబ్బు ఇస్తావా వీడియోను నీ కుటుంబ సభ్యులు, బంధువులకు పంపమంటావా అని బెదిరింపులకు పాల్పడింది. దీంతో పరువుపోతుందని భావించిన అతను ఆమెకు రూ.15 లక్షలు ముట్టజెప్పాడు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్‌ చేస్తుండటంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement