గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ చైర్మన్‌

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

గవర్నర్‌ను కలిసిన రెడ్‌క్రాస్‌ చైర్మన్‌

కాశిబుగ్గ: గవర్నర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ప్రతాప్‌ శుక్లాను ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు బేతి అశోక్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, జిల్లాకు సంబంధించిన చేనేత కార్పెట్‌, టవల్‌తో పాటు మెమొంటోతో సత్కరించారు. అనంతరం జిల్లాలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలను విస్తృత పర్చడానికి సంస్థకు అవసరమైన స్థలాన్ని, తగిన నిధులను కేటాయించాలని కోరారు. రక్తనిధి సేకరణలో భాగంగా మండలాలు, గ్రామాల్లోని వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఏడాదిలో ఒకసారి రక్తనిధి సేకరణలో భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన కొత్తవాడ, శాయంపేట ప్రాంతాల చేనేత కార్మికుల సమస్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement