● పీటీసీ ప్రిన్సిపాల్ పులిగిల్ల రవీందర్
● ముగిసిన హెడ్ కానిస్టేబుళ్ల పదోన్నతి శిక్షణ
ఖిలా వరంగల్ : పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ పులిగిల్ల రవీందర్ అన్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే క్రమంలో పీటీసీలో నిర్వహించిన రెండు వారాల ప్రీ ప్రమోషనల్ శిక్షణ ఆదివారం ముగిసింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందిని అభినందించారు. డీఎస్పీలు కె. రవీందర్, ఎస్.వెంకటేశ్వరరావు, డి.సోమాని, సీఐలు ఎం.రామ్మూర్తి, ఎన్.సత్యనారాయణ, కె. అశోక్, ఎ.నరేందర్, ఎం.రాజ్యలక్ష్మి, ఎస్.మహేశ్, సీసీ రామాంజారెడ్డి, ఇతర సిబ్బంది ఉన్నారు.


