విద్యుత్‌ పొదుపుతో ఆర్థిక మదుపు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పొదుపుతో ఆర్థిక మదుపు

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

విద్యుత్‌ పొదుపుతో ఆర్థిక మదుపు ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ పోటీలు అండగా యువ ఆపద మిత్రలు విద్యార్థులు సేవే కెరీర్‌గా ఎంచుకోవాలి కవచ్‌ ట్రయల్స్‌ షురూ

హన్మకొండ: విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం వల్ల కేవలం విద్యుత్‌ బిల్లు మాత్రమే తగ్గదని, కుటుంబ ఆర్థిక స్థితి, విద్యుత్‌ వ్యవస్థ స్థిరత్వం, సహజ వనరుల పరిరక్షణ, పర్యావరణం వంటి అనేక అంశాల్లో మేలైన ప్రయోజనం కలుగుతుందని టీజీ ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌, హనుమకొండ సర్కిల్‌ సూపరిండెంట్‌ ఇంజనీర్లు ఎ.ఆనందం, సామ్యానాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీని 24 డిగ్రీల సెల్సి యస్‌, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద విని యోగించడం ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు. గీజర్లు, వాటర్‌ హీటర్లు, ఇసీ్త్ర పెట్టెలు వంటి అధిక విద్యుత్‌ వినియోగ పరికరాలను అవసరమైన మేరకే ఉపయోగించాలని సూచించారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో మంగళవారం నిర్వహించిన వరంగల్‌, హనుమకొండ జిల్లాల స్థాయి సబ్‌జూనియర్స్‌, జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో 550 మంది అథ్లెట్లు హాజరయ్యారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్‌ఎస్‌ వేదికగా జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ బాలబాలికల పోటీల్లో, ఆసిఫాబాద్‌లో జరగనున్న సబ్‌జూనియర్స్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ముగింపు వేడుకలకు వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ గట్టు మహేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు సర్టిఫికెట్లు అందించారు. తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఊర యుగేంధర్‌రెడ్డి, బాధ్యులు పీడీలు కిషన్‌ కృష్ణమూర్తి, రజనీకాంత్‌, కోచ్‌లు పాల్గొన్నారు.

ఖిలా వరంగల్‌: విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ఆపద మిత్రల పాత్ర కీలకమని టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌వీఎస్‌. శ్రీనివాస్‌రావు అన్నారు. మామునూరు 4వ బెటాలియన్‌ ఆవరణలో ఏడు రోజులుగా నిర్వహించిన యువ ఆపద మిత్ర శిక్షణ మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథిగా కమాండెంట్‌ హాజరై 102 మంది శిక్షణార్థులు శిక్షణ పత్రాలు అందించి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న ప్రతీ అంశాలతో విపత్తు సమయాల్లో బాధితులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఏసీ రాజేందర్‌, ఆర్‌ఐలు కార్తీక్‌, రవి, రాజ్‌కుమార్‌, రాంప్రసాద్‌, శిక్షణార్థులు పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: నిట్‌ విద్యార్థులు ప్రజాసేవే కెరీర్‌గా ఎంచుకోవాలని నిట్‌ పూర్వ విద్యార్థి, ఐఏఎస్‌, కమిషనర్‌ బెంగళూరు నార్త్‌ సిటీ కార్పొరేషన్‌ పొమ్మాల సునీల్‌కుమార్‌ అన్నారు. నిట్‌ క్యాంపస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘టాక్‌ ఆన్‌ ఐఏఎస్‌ ఆస్పిరెంట్స్‌’ అంశంపై ఐఏఎస్‌ పొమ్మాల సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ.. నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో 2002వ బ్యాచ్‌ ట్రిపుల్‌ఈ విద్యార్థినైన తాను ఐఏఎస్‌గా ఎంపికవడం నిట్‌లోని అత్యుత్తమ బోధనతోనే సాధ్యమైందన్నారు. ముందుగా నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ మొక్కను అందించి క్యాంపస్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు కిశోర్‌కుమార్‌, శ్రీనివాస్‌రావు, బెనర్జీబాబు పాల్గొన్నారు.

కాజీపేట రూరల్‌: కాజీపేట–మోటమర్రి సెక్షన్‌లో మంగళవారం రైల్వే అధికారులు కవచ్‌ ట్రయల్స్‌ ప్రారంభించారు. భారత రైల్వే ప్రతిష్టాత్మక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞనం కవచ్‌ వ్యవస్థను నిర్మించి ట్రయల్స్‌కు సిద్ధం చేసి నడిపించారు. సికింద్రాబాద్‌కు చెందిన డీఎస్‌టీఈ యుగేంధర్‌, ఏటీఎస్‌టీఈ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎస్‌ఐఎల్‌–0 ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్‌ను దక్షిణ మధ్య రైల్వే సీఎస్‌టీఈ ప్రాజెక్ట్స్‌ ఎం.కోటేశ్వర్‌రావు, డీపీఎస్‌టీఈ జి.కుమారన్‌ పర్యవేక్షిస్తున్నట్లు వారు తెలిపారు. కాజీపేటలో చేపట్టిన ట్రయల్స్‌లో కాజీపేట స్టేషన్‌ మేనేజర్‌ అగ్గి రవీందర్‌, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement