వీడ్కోలుకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

వీడ్కోలుకు వేళాయె!

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

వీడ్కోలుకు వేళాయె!

ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేయాలి

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌లో నేడు (బుధవారం) వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలోని 19 చెరువుల వద్ద నిమజ్జనం జరగనుంది. అందుకోసం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రముఖంగా చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం, గొర్రెకుంట కట్టమల్లన్న, గుండు చెరువు అగర్తల, మామునూరు బెస్తం చెరువు వద్ద నిమజ్జనం జరగనుంది. హనుమకొండ, కాజీపేటలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్‌పర్తి పెద్ద చె రువు, గోపాల్‌పూర్‌, భీమారం, కడిపికొండ, మడికొండ, సోమిడి, ఎల్లాపూర్‌, గుండ్ల సింగారం, రాంపూర్‌, సింగారం, చల్ల చెరువు వద్ద నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి.

శాఖల వారీగా ఏర్పాట్లు ఇలా..

● మైనింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 30 క్రేన్లు ఏర్పాటు చేశారు. వరంగల్‌ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద 7 క్రేన్లను, ఉర్సు రంగసముద్రం 6, బెస్తం చెరువు 2, ఖిలా వరంగల్‌ అగర్తలా ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. హనుమకొండ సిద్ధేశ్వర గుండం వద్ద 1, బంధం చెరువుల వద్ద 3, హసన్‌పర్తి పెద్ద చెరువు 2, కడిపికొండ, భీమారం, చల్ల చెరువు వద్ద ఒకటి తదితర విలీన గ్రామాల్లో క్రేన్లను అందుబాటులో ఉంచారు.

● బల్దియా ఆధ్వర్యంలో రోడ్లు చదును చేసి, ప్యాచ్‌ వర్క్‌లు, రోడ్డు విస్తరణకు రూ.కోటి ఖర్చు చేశారు. అన్ని చెరువుల వద్ద విద్యుత్‌ లైట్లతో జిగేల్‌మనేలా లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో మంచి నీరు సరఫరా చేసేందుకు వాటర్‌ ట్యాంకర్లను సిద్ధం చేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

● ఎన్పీడీసీఎల్‌ అధికారులు నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు ట్రాన్స్‌ఫార్మర్లను, జనరేటర్లను అందుబాటులో ఉంచారు.

● ఆర్‌అండ్‌బీ శాఖ నేతత్వంలో ఆరు కేంద్రాలలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

● మత్స్య శాఖ నుంచి 1,200 మంది గజఈతగా ళ్లు, 26 తెప్పలు, బ్యాలెన్సింగ్‌ల ద్వారా సేవలు అందించనున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా ఐదుగురు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

● మెడికల్‌ అండ్‌ హెల్త్‌ శాఖ ప్రతి నిమజ్జన కేంద్రం వద్ద ఉచితంగా మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు.

● మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, 108 వాహనాలు ఏర్పాటు చేశారు.

● పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు, శాంతిభద్రత పర్యవేక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ చేయనున్నారు.

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో

నేడు వినాయక నిమజ్జనం

జల వనరుల వద్ద 32 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లు

శోభాయాత్ర దారిలో వీధిదీపాలు, ప్రధాన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు

ఏర్పాట్లు పూర్తి చేసిన బల్దియా అధికారులు

హన్మకొండ అర్బన్‌/న్యూశాయంపేట: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు చాహత్‌బాజ్‌పాయ్‌, సత్యశారద సూచించారు. మంగళవారం అదనపు కలెక్టర్‌ రవి, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకన్నతో కలిసి కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ టెలికాన్ఫన్స్‌లో అధికారులకు సూచనలిచ్చారు. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement