ప్రమాదం నుంచి పాఠం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదం నుంచి పాఠం

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

ప్రమాదం నుంచి పాఠం

జీఎంహెచ్‌లో గతంలో షార్ట్‌సర్క్యూట్‌

అప్పటినుంచి పటిష్ట భద్రత ఏర్పాట్లు

హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సుమారు తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఘటన అధికారులను మేల్కొల్పింది. అక్టోబర్‌ 31, 2017న సాయంత్రం 6గంటలకు జనరేటర్‌ జంక్షన్‌ వద్ద విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఆస్పత్రి గందరగోళంగా మారింది. అప్పుడే పుట్టిన చిన్నారులను ఎత్తుకుని బాలింత బంధువులు పరుగులు తీయగా, గర్భిణులు, రోగి బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. సుమారు రెండు గంటల పాటు ప్రసూతి ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.

శిశు సంజీవనిలో 20 బెడ్లు

ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి పైఅంతస్తులోని శిశు సంజీవని ప్రత్యేక నవజాత శిశు చికిత్స కేంద్రంలో బెడ్లు ఉన్నాయి. నలుగురు పిల్లల వైద్య నిపుణులు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తుండగా.. ఇద్దరు రెగ్యులర్‌గా విధుల్లో ఉన్నట్లు జీఎంహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం 15మంది నవజాత శిశువులు స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు డాక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement