ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

నీరుకుళ్లలో ఘటన

ఆత్మకూరు: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెన్నపు లక్ష్మయ్య(55) వ్యవసాయ పెట్టుబడులు, కుటుంబ అవసరాలకు అప్పులు చేశాడు. అలాగే, భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో పంట దిగుబడి లేకపోవడం, అప్పులు తీర్చలేక కనిపించకపోవడంతో కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం పంటకు పురుగు మందు పిచికారీ చేస్తానని చేను వద్దకు వెళ్లాడు. కాసేపటి తర్వాత చేను వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో వారు 108లో వరంగల్‌ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement