అధికారుల సమీక్షలో హనుమకొండ అదనపు కలెక్టర్ రవి
హన్మకొండ అర్బన్: జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్..రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, డీఆర్‌డీఏ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు–కొలతల శాఖల అధికారులు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పీఏసీఎస్ సీఈఓలు, ఏపీఎంలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 25 తేదీలోగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ కొలిచే పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పీఏసీఎస్ సీఈఓలు, ఏపీఎంలు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మహేందర్, డీఆర్‌డీఓ శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర, జిల్లా సహకార అధికారి మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, తూనికలు–కొలతల శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


