హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సుబేదారిలోని రెడ్‌క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ ఎన్.రవి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ మంగళవారం త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్‌సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాసరావు, బి. ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్, శ్యాంసుందర్ పాల్గొన్నారు.
బాధితుల పునరావాసానికి ప్రాధాన్యం
మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు బాధితులకు సత్వరన్యాయం, పరిహారం అందించడం, వారి పునరావాసానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఆమె మాట్లాడారు. డీడబ్ల్యూఓ ఎం.విశ్వజ, జిల్లా వైద్యాధికారి, అదనపు డీఆర్‌డీఓ, భరోసా సీఐ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
మోడల్ సోలార్ గ్రామాల్లో సేవలు వేగవంతం
ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపికై న ఆత్మకూరు, కేశవాపురంలో ప్రతి ఇంటికి సోలార్ ప్యానళ్లతో పాటు విద్యుత్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సామ్యనాయక్, రెడ్‌కో జిల్లా మేనేజర్ రాజేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
నిరంతర వైద్య సేవలందించాలి
హసన్‌పర్తి: ప్రజలకు నిరంతరం వైద్యసేవలంఇంచాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. హసన్‌పర్తిలోని ఉన్నత శ్రేణి ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించారు. అనంతరం పెంబర్తి శివారు దత్తాత్రేయ కాలనీలో వాటర్ ట్యాంక్ పనులను కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ కిరణ్‌కుమార్, డాక్టర్ భార్గవ్, డాక్టర్ కృతిక, సూపర్‌వైజర్ లచ్చులు, కందుకూరి సంతోష్, కంటి వైద్య నిపుణులు ప్రసాద్, పెంబర్తి సర్పంచ్ కుమారస్వామి, ఆర్‌ఐ ఫాజిల్, ఈఈ గాయత్రి, రామాంజనేయులు, ఎంపీడీఓ సుమనవాణి ఉన్నారు.


