హన్మకొండ: ఓడిపోయి ఇంటిలో కూర్చుంటే కేటీఆర్‌ను పంపి బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని గల్లీనుంచి ఢిల్లీకి పంపి రాజకీయ భిక్ష పెట్టి.. పార్టీలో ప్రాధాన్యత కల్పించింది.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాదా.. అని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ దళిత వ్యతిరేకి అని మాట్లాడుతాడా అని తూర్పారబట్టారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై వారం రోజులపాటు చేపట్టిన పోరుబాట కార్యక్రమం చివరి రోజు మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహానికి వినయ్‌భాస్కర్, పార్టీ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు పదవులకు ఆశపడి కడియం శ్రీహరి కులంపై దూషించిన రేవంత్‌ను మెచ్చుకుంటున్నాడన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే గురువు చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఉద్యమాన్ని నీరుగార్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై అమానుషంగా ప్రవర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, నార్లగిరి రమేశ్, జోరిక రమేశ్, పులి రజనీకాంత్, మట్టపల్లి రమేష్, కుమ్మరి లలిత, ఇమ్మడి లోహిత, ఖండేరావు నర్సింహారావు, నయీముద్దీన్, ఉడుతల సారంగపాణి పాల్గొన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ పోరాటం
కాశిబుగ్గ : కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాశిబుగ్గ జంక్షన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం సమర్పించారు. అలాగే, అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పిన పాలకులు వెయ్యి రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారని వారు విమర్శించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, డివిజన్ అధ్యక్షులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే
దాస్యం వినయ్‌భాస్కర్ ఫైర్


