నయీంనగర్: హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూ య (సీతక్క), స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంగళవారం ‘కుడా’ చైర్ పర్సన్ గుండు సుధారాణి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ‘కుడా’ చైర్ పర్సన్ సుధారాణికి మంత్రి, ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
16న డాక్ అదాలత్
ఖిలా వరంగల్: వరంగల్ డివిజన్ తపాలాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 16న ఉదయం 11 గంటలకు డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ కార్య క్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని ఆయన పేర్కొన్నారు.
● బల్లార్షా–కాజీపేట నాలుగో రైల్వేలైన్‌కు సర్వే
కాజీపేట రూరల్ : బల్లార్షా–కాజీపేట వరకు నా లుగో రైల్వేలైన్ నిర్మాణ ప్రతిపాదన సర్వే నిమిత్తం బుధ, గురువారాలు రెండు రోజులపాటు రైల్వే అధికారులు పర్యటించనున్నట్లు మంగళవారం రాత్రి కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బల్లార్షా–కాజీపేట వరకు 3వ లైన్ నిర్మాణం పూర్తికాగా, రైళ్ల ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు బల్లార్షా–కాజీపేట వరకు సుమారు 230 కి.మీ వరకు నాలుగో రైల్వే లైన్ సర్వే కోసం అధికారులు రెండు రోజులు ఆయా సెక్షన్లలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. కన్‌స్ట్రక్షన్, సిగ్నలింగ్, ఆపరేటింగ్, ఇంజనీరింగ్, ఓహెచ్‌ఈ విభాగాల రైల్వే సూపర్‌వైజర్లు హద్దులు, ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణాల కోసం సర్వే చేయనున్నట్లు తెలిపారు.
బీజేపీ ప్రభారీల నియామకం
గీసుకొండ: వరంగల్ జిల్లాలోని పలు మండలాలు, డివిజన్లకు బీజేపీ ప్రభారీలను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రా వు, సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీజీ, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, జిల్లా ప్రభారీ కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభారీలను నియమించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మారంపల్లి రాంచంద్రారెడ్డి(దేశాయిపేట), అంబాల రాంగోపాల్(గిర్మాజిపేట), కుమా ర్ (కాశిబుగ్గ), సత్యం (శివనగర్), కోటేశ్వర్(ఖిలావరంగల్), మహేందర్ (కరీమాబాద్), ఆంజనేయులు(వర్ధన్నపేట), బాలినె జగన్ (ఏనుమాముల), వనపర్తి మల్లయ్య (పర్వతగిరి), మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి (నర్సంపేట టౌన్), కనికుంట్ల రంజిత్‌కుమార్ (నర్సంపేట రూరల్) కూడికల శ్రీధర్ (నెక్కొండ), బండి సాంబయ్య యాదవ్ (చెన్నారావుపేట)మాచర్ల దీన్‌దయాల్ (ఖానాపురం), రఘునాథరెడ్డి (నల్లబెల్లి), శ్యాంసుందర్ (దుగ్గొండి)లను ప్రభారీలుగా నియమించినట్లు తెలిపారు.


