‘వనజీవి’ షూటింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘వనజీవి’ షూటింగ్‌ ప్రారంభం

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

బచ్చన్నపేట : పర్యావరణ పరిరక్షణే పరమావధిగా మొక్కలు నాటడాన్ని ఉద్యమంగా మార్చిన వనజీవి రామయ్య జీవితం ఆధారంగా ‘వనజీవి’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని సినిమా దర్శకుడు వేముగంటి, నిర్మాత నిడిగొండ నరేశ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని కొడవటూర్‌లో గల సిద్ధుల గుట్ట పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి అందాల నడుమ సిద్ధుల గుట్ట లో ఈ చిత్ర నిర్మాణాన్ని 100 రోజుల పాటు నిర్మించనున్నామని తెలిపారు. ఈ చిత్రంలో వనజీవి పాత్రలో బ్రహ్మాజీ, ఆయన భార్య పాత్రలో నాగరాణి నటిస్తున్నారని, డీఓపీగా తోట రమణ, సంగీత దర్శకుడిగా బల్లేపల్లి మోహన్‌ వ్యవహరిస్తున్నారని తెలిపారు.

‘కుడా’ చైర్‌పర్సన్‌కు

మంత్రి పొన్నం అభినందన

నయీంనగర్‌: హైదరాబాద్‌ మినిస్టర్‌ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సోమవారం కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. సుధారాణికి మంత్రి అభినందనలు తెలిపి, శాలువాతో సత్కరించారు.

దరఖాస్తుల ఆహ్వానం

న్యూశాయంపేట: బీసీ మహిళల ఆర్థిక సాధికారతకు వందశాతం సబ్సిడీతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆటోమెటిక్‌ కుట్టుమిషన్ల పంపిణీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల మహిళలు టీజీఓబీఎంఎంఎస్‌.సీజీసీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హనుమకొండ లష్కర్‌బజార్‌లోని కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement