కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవం ఈఏడాది నవంబర్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి.. రిజిస్ట్రార్ వి. రా మచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌తో కలిసి హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ శివప్రతాప్‌శుక్లాను కలిసి స్నాతకోత్సవానికి ఆహ్వానించారు. దీనిని గవర్నర్ అంగీకరించినట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం తెలిపారు. స్నాతకోత్సవానికి సంబంధించిన పలు అంశాలను ఈసందర్భంగా గవర్నర్‌కు వీసీ ప్రతాప్‌రెడ్డి వివరించారు. త్వరలోనే లోక్‌భవన్ నుంచే స్నాతకోత్సవ తేదీని ఖరారు చేసి కేయూకు సమాచారం అందిస్తారు.
గోల్డ్‌మెడల్స్, పీహెచ్‌డీ పట్టాల ప్రదానం
కాకతీయ యూనివర్సిటీ 24వస్నాతకోత్సవంలో 2021–2022, 2022–2023, 2023–2024, 2024–2025 విద్యాసంవత్సరాలకు సంబంధించిన వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. 380 మందికిపైగా విద్యార్థులకు ప్రదానం చేయనున్నారు. అలాగే, గతేడాది జూలై నుంచి ఈఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు కూడా ఆర్ట్స్, సైన్స్, సోషల్‌సైన్స్‌సెస్, కామర్స్‌అండ్‌బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫార్మసీ, లా, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ విభాగాల్లో పీహెచ్‌డీ అవార్డు అయిన పరిశోధక అభ్యర్థులకు డాక్టరేట్ పట్టాలు కూడా ప్రదానం చేయనున్నారు. ఈమేరకు ఒకటిరెండు రోజుల్లో పరీక్షల విభాగం అధికారులు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. పీహెచ్‌డీ పట్టాలు పొందే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
నవంబర్ చివరి వారంలో నిర్వహణ
గవర్నర్‌ను కలిసిన వీసీ, రిజిస్ట్రార్
హాజరయ్యేందుకు గవర్నర్ అంగీకారం


