రైస్‌ మిల్లర్ల అరెస్ట్‌, రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లర్ల అరెస్ట్‌, రిమాండ్‌

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

వివరాలు వెల్లడించిన పోలీసులు

కొత్తగూడ: ప్రభుత్వానికి బకాయి ఉన్న రైస్‌ మిల్ల ర్లను జిల్లా సివిల్‌ సప్లయ్‌ డీఎం నర్సింహరావు ఫిర్యాదు మేరకు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గూడూరు సీఐ వినయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం కొత్తగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ఈశ్వర ట్రేడర్స్‌, పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహ ట్రేడర్స్‌, గంగారం మండలం కామారం గ్రామానికి చెందిన యాకూబ్‌ అలీ బిన్ని రైస్‌ మిల్‌ యజమానులు 20023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సరఫరా చేసిన సీఎంఆర్‌ ధాన్యం దిగుమతి చేసుకున్నారు. బియ్యం సరఫరా చేయకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. ప్రతీ మిల్లు రూ. 3 కోట్ల పైచిలుకు బకాయి పడింది. దీనిపై సివిల్‌ సప్లయ్‌ శాఖ నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదు. దీంతో ఆ శాఖ డీఎం ఫిర్యాదు మేరకు మూడు మిల్లుల యజమానులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈసమావేశంలో కొత్తగూడ, గంగారం ఎస్సైలు పాల్గొన్నారు.

పార్ట్‌టైం లెక్చరర్‌కు షోకాజ్‌ నోటీస్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పార్ట్‌ టైం లెక్చరర్‌కు రిజిస్ట్రార్‌ రామచంద్రం ఈనెల 3న షోకాజ్‌నోటీస్‌ జారీ చేశారు. అదే కళాశాల కు చెందిన ఓ పరిశోధకుడు పలు ఆరోపణలు చేస్తూ ఇటీవల రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. సదరు పార్ట్‌టైం లెక్చరర్‌.. వివిధ విభాగాల పార్ట్‌టైం లెక్చరర్ల నుంచి కాంట్రాక్టు లెక్చరర్లుగా కన్వర్షన్‌ చేయిస్తానని నమ్మించి కొంత డబ్బులు వసూలు చేయడంతోటు వివిధ ఆరోణలు చేస్తూ అతడిపై రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో రిజిస్ట్రార్‌ రామచంద్రం.. ఆ ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సదరు పార్ట్‌టైం లెక్చరర్‌కు షోకాజ్‌నోటీస్‌ జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement