మార్కెట్‌లోకి పల్సర్‌–150 న్యూమోడల్‌ బైక్‌ | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి పల్సర్‌–150 న్యూమోడల్‌ బైక్‌

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

కాజీపేట అర్బన్‌ : వరంగల్‌ ములుగు రోడ్డులోని అనికా బజాజ్‌ షోరూంలో సోమవారం పల్సర్‌ –150 న్యూ మోడల్‌ బైక్‌ను అడిషనల్‌ డీసీపీ(ఏఆర్‌) వేముల శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఎండీ సురేందర్‌ రా వు వివరాలు వెల్లడించారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పల్సర్‌ –150 ప్రస్తుతం ‘ది ఒరిజినల్‌ మోర్‌ డ్రైవింగ్‌ వర్షన్‌’ అధునాతన టెక్నాలజీతో మార్కెట్‌లోకి వస్తుందని తెలిపారు. వెల్ఫ్‌ ఐ హెడ్‌ లైట్‌ డీఆర్‌ఎల్‌తో సెంగెమెంట్‌లో మొదటి డీ–క్లాస్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌తో రాత్రి వేళ్లలో ప్రయాణం సులభంగా ఉంటుందన్నారు. స్పోర్ట్‌, రెయిన్‌, రోడ్డు రైడ్‌ మొడ్స్‌తో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో షోరూం జీఎం షైనీదర్‌, అకౌంట్స్‌ మేనేజర్‌ ఎల్‌. సుధాకర్‌, అమ్జద్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆవిష్కరించిన అడిషనల్‌ డీసీపీ(ఏఆర్‌) శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement