అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి : | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి :

Sep 8 2026 12:53 AM | Updated on Sep 8 2026 12:53 AM

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో పాటు అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో జిల్లాస్థాయిలో 123, డివిజన్‌ స్థాయిలో 23, మండల స్థాయిలో 123 చొప్పున మొత్తం 269 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ శేషాద్రి, డీఆర్‌ఓ శ్రీనివాస్‌, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement