హన్మకొండ కల్చరల్: శ్రావణమాసంలోని చివరి సోమవారాన్ని పురస్కరించుకుని వేయిస్తంభాల ఆలయంలో శనివారం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు రుద్రేశ్వరస్వామికి అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. 150 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. పూజల్లో ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమారాణి దంపతులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్చకులు ప్రణవ్, శ్రవణ్ పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంట్ విభాగాధిపతిగా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య నియమితులయ్యారు. సోమవారం ఈమేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్ ఉత్తర్వుల కాపీని కనకయ్యకు అందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్, ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ డాక్టర్ భిక్షపతి, వర్కింగ్ చైర్మన్ డాక్టర్ ఫిరోజ్‌పాషా, అధ్యాపకులు కనకయ్యను అభినందించారు.
హసన్‌పర్తి: నేత్రదానంతో ఇద్దరికి చూపు ప్రసాదించవచ్చని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని హసన్‌పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో సోమవారం నేత్ర దాన అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఇమ్యూనేజషన్ అధికారి డాక్టర్ కృపారావు, అప్తాల్మిక్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, డీపీఎంఓ దేవ్‌సింగ్, వైద్యులు భార్గవ్, మునీబ్, హెల్త్ సూపర్‌వైజర్ లచ్చు తదితరులు ఉన్నారు.
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌లో ముగ్గురు డీఈలకు యాజమాన్యం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడ్‌హక్ పద్ధతిలో వీరికి సూపరింటెండ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు. హనుమకొండ సర్కిల్‌లోని ఎమ్మార్టీ, కన్‌స్ట్రక్షన్ డీఈ ఎ.విజేందర్‌రెడ్డికి కరీంనగర్ ఆపరేషన్ ఇన్‌చార్జ్ సూపరింటెండ్‌గా నియమించారు. భూపాలపల్లి సర్కిల్‌లో ఎమ్మార్టీ, కన్‌స్ట్రక్షన్ డీఈ ఎన్.సదానందానికి భూపాలపల్లి ఇన్‌చార్జ్ సూపరింటెండ్ ఇంజనీర్‌గా నియమించారు. నిజామాబాద్ సర్కిల్‌లోని ఆపరేషన్ డీఈగా ఎం.శ్రీనివాస్‌కు రాజన్న సిరిసిల్ల ఇన్‌చార్జ్ ఎస్‌ఈగా నియమించారు.


