లిటరసీలో హనుమకొండ టాప్.. మహబూబాబాద్ లాస్ట్
హనుమకొండదే పైచేయి..
ఆరు జిల్లాల్లో హనుమకొండ అక్షరాస్యతలో స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా, మహబూబాబాద్ చివరి స్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత గణనీయంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఎక్కువగా గిరిజన మారుమూల ప్రాంతాలు ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు, ఆడపిల్లల చదువుపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పత్తి సాగు, మిర్చి కోతలు, ఇతర కూలీ పనుల కోసం కుటుంబాలు పిల్లలను కూడా వెంటబెట్టుకుని వలసలు వెళ్లడం మరో కారణంగా తెలుస్తోంది. కాగా, 2011 గణాంకాల ఆధారంగా ఉన్న ఈ వ్యత్యాసాలను ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే జిల్లాల విద్యాభివృద్ధి మెరుగై ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు.
వరంగల్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల అక్షరాస్యతలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్ – 2026లో హనుమకొండ జిల్లా 74.13 శాతం అక్షరాస్యతతో అగ్రస్థానంలో ఉండగా.. మహబూబాబాద్ 57.13 శాతంతో చివరి స్థానంలో ఉంది. మిగిలిన జిల్లాల్లో వరంగల్ 64.55, ములుగు 62.26, జనగామ 61.60, జయశంకర్ భూపాలపల్లి 58.97 శాతం అక్షరాస్యతను నమోదు చేశాయి. నేడు (మంగళవారం) అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత వివరాలతో కథనం.
మహిళల్లో వెనుకబాటు నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం


