● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
కాజీపేట అర్బన్ : జనసమూహాల్లో పోలీసుల తీరును ప్రజలు గమనిస్తారని, అందుకే సంయమనం పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. కాజీపేట మండలం మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో భద్రాద్రి జోనల్ పరిధి పోలీస్ శిక్షణార్థులకు ఏర్పాటు చేసిన నాలుగు రోజుల తరగతులను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా పండుగలు, జాతరలు, ఊరేగింపులు జరిగే సమయాల్లో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ట్రైనీలకు తరగతిలో బోధనతోపాటు ప్రాక్టికల్‌గా అధికారులు వివరించాలన్నారు. అడిషనల్ డీసీపీలు ప్రభాకర్‌రావు, శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రమణబాబు, ఆర్‌ఐ సింహాచలం శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు సూర్యప్రసాద్, వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్లు హాజరయ్యారు.


