పెండింగ్‌ బిల్లులు రాక మనస్తాపం.. | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు రాక మనస్తాపం..

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

ఆత్మహత్యాయత్నం చేసిన అంకుషాపూర్‌ మాజీ సర్పంచ్‌

టేకుమట్ల : పెండింగ్‌ బిల్లులు రాక మనస్తాపం చెందిన మాజీ సర్పంచ్‌ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో జరిగింది. బాధితుడు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని అంకుషాపూర్‌ మాజీ సర్పంచ్‌ పండుగ శ్రీనివాస్‌ (సర్పంచ్‌గా ఉన్నప్పుడు) సుమారు రూ.19 లక్షలను అప్పు తెచ్చి పనులు చేయించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌ బిల్లులు రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైనా వస్తాయని ఎదురు చూశాడు. తీసుకున్న నగదుకు వడ్డీలు కట్టలేక తీవ్ర మనస్తాపానికి నిత్యం గు రయ్యాడు. ఏదో ఒకరోజు బిల్లులు వస్తాయ నుకున్నా ఫలితం లేదు. దీంతో శ్రీనివాస్‌ శనివారం సాయంత్రం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు య త్నించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే ఆయన ను చికిత్స కోసం చిట్యాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు పనులు చేశానని, సంవత్సరాలు గడుస్తున్నా పెండింగ్‌ బిల్లులు రాకపోవడంతో చావే శరణ్యమని ఆత్మహత్యకు సిద్ధమయ్యానని శ్రీనివాస్‌ కన్నీటి పర్యంతమయ్యాడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement