ప్రజాధనం దుర్వినియోగం | - | Sakshi
Sakshi News home page

ప్రజాధనం దుర్వినియోగం

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

ఖిలా వరంగల్‌: అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, డ్రెయినేజీలను ఆక్రమించి నిర్మించిన 123 భవనాలను వెంటనే గుర్తించి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని వినియోగదారుల సమాఖ్య దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు మొగలిచెర్ల సుదర్శన్‌ డిమాండ్‌ చేశారు. వరంగల్‌ శివనగర్‌లో వినియోగదారుల సమాఖ్య కార్యాలయంలో మురహరి కార్తీక్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు, మట్టికోట ధ్వంసం చేసి అండర్‌ డ్రెయినేజీ నిర్మాణం చేయడంపై హైకోర్టులో రిట్‌ ఫిటిషన్‌ వేశామని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఇంజనీర్‌ దిడ్డి లక్ష్మీనారాయణ, న్యాయ సలహా సభ్యులు రాయబారపు భిక్షపతి, ఆర్‌.ఆనందరావు, బండి అనిల్‌కుమార్‌, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement