● రాంపూర్‌లో ఘటన
ధర్మసాగర్ : అతివేగంగా వచ్చిన కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాజీపేట మండలంలోని రాంపూర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన ఇటుక రాజుఈశ్వర్ (60) ఆదివారం మధ్యాహ్నం తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన కారు ఆయనను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజు ఈశ్వర్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


