విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

విద్యారణ్యపురి : విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని హనుమకొండ ఎంఈఓ నెహ్రూ అన్నారు. హనుమకొండ జిల్లా అన్‌ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ (హడుప్సా) ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ వాగ్దేవి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల సెమినార్‌ హాల్‌లో 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. హడుప్పా అధ్యక్షుడు టి.బుచ్చిబాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ సబ్జెక్టుల్లో నైపుణ్యాలను పెంచుకోవాలని, క్రమశిక్షణ పెంచాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు. రిటైర్డ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మూల జితేందర్‌రెడ్డి, కాజీపేట ఎంఈఓ బి.మనోజ్‌కుమార్‌, హడుప్సా ముఖ్య సలహాదారు వర్ధమాన్‌ జనార్దన్‌ మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. హడుప్సా జనరల్‌ సెక్రటరీ ఎం.సంతోష్‌రెడ్డి, ట్రెజరర్‌ డి.శంకర్‌, సలహాదారులు ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి, పి.వెంకటరమణ, వైస్‌ ప్రెసిడెంట్‌ టి.రాజేశ్వర్‌రావు, జాయింట్‌ సెక్రటరీలు మధుకర్‌రెడ్డి, శివానందు, స్పెషల్‌ ఇన్వైటీ ఎం.సతీష్‌కుమార్‌, అకడమిక్‌ కన్వీనర్‌ రామారావు, జాయింట్‌ ట్రెజరరీ నవీన్‌రెడ్డి, కార్యవర్గసభ్యులు సంపత్‌రెడ్డి, రామచంద్రమూర్తి, అనిల్‌కుమార్‌, వాసుదేవరెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement