రామప్పలో సోమసూత్రం పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

రామప్పలో సోమసూత్రం పునరుద్ధరణ

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

వెంకటాపురం(ఎం) : శతాబ్దలుగా మూసుకుపోయిన రామప్ప గర్భగుడి సోమసూత్రాన్ని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు శనివారం పునరుద్ధరించారు. ఆలయంలో విధ్వంసం లేని శాసీ్త్రయ పద్ధతులను అవలంబించి ఆధునిక పరికరాల సాయంతో సోమసూత్రాన్ని శుభ్రం చేశారు. సోమసూత్రాన్ని పునరుద్ధరించే క్రమంలో అంతర్గత అడ్డంకులకు సంబంధించి శాసీ్త్రయ 3డీ మ్యాపింగ్‌, ఎండోస్కోపిక్‌, గోప్రో కెమెరాలతో రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ స్క్రీన్‌ల ద్వారా తనిఖీ చేశారు. దేవాలయ నిర్మాణానికి ఎటువంటి నష్టం కలగకుండా సాఫ్ట్‌ డ్రిల్లింగ్‌ విధానంతో పొరలు పొరలుగా (లేయర్‌ బై లేయర్‌) అడ్డుగా ఉన్న రాతి భాగాలను తొలగించినట్లు ఆర్కాలాజికల్‌ డీఈ కృష్ణచైతన్య, సీఎలు మల్లేష్‌, కన్నియప్పన్‌, ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్‌తెలిపారు.

భూకంపంతోనే మూసుకుపోయింది

17వ శతాబ్దంలో వచ్చిన భూకంపంతో రామప్పలోని సోమసూత్రం మూసుకుపోయి ఉంటుందని దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 1911లో నిజాం ప్రభుత్వం ఆలయాన్ని పునరుద్ధరించినప్పటికీ 1944 నుంచి రామప్ప ఆలయంలో నిత్యపూజలు జరిగాయి. 2001లో రామప్ప (పాలంపేట)కు చెందిన ప్రముఖులు గర్భగుడిలోని రా మలింగేశ్వరస్వామికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ క్రమ ంలో సోమసూత్రం మూసుకపోయిందని గ్రహించిన అర్చకులు ప్రధాన శివలింగం వద్ద పంచలోహ శివలింగాన్ని పెట్టి చిలకరింపు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు పురావస్తుశాఖ సూపరింటెండెంట్‌ నిహిల్‌దాస్‌ ఆదేశాల మేరకు పురావస్తుశాఖ అధికారులు రెండ్రోజులుగా శ్రమించి సోమసూత్రాన్ని పునరుద్ధరించారు. దీంతో పర్యాటకులు, స్థాని కులు, శివభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement