విద్యారణ్యపురి : విద్యార్థులకు అన్ని రకాల విలువలు నేర్పిస్తున్నది ఉపాధ్యాయులేనని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాను కలెక్టర్‌గా ఉన్నప్పటికి తనకు విద్యనందించిన గురువులతో ఇప్పటికి సోషల్‌మీడియాలో టచ్‌లో ఉంటున్నానని, వారు ఎ ంతో సంతోష పడుతుంటారని గుర్తుచేసుకున్నారు. జిల్లాలో 15 ఏళ్ల సర్వీస్ కలిగి ఉండి వివిధ అంశాల ను పరిగణలోనికి తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులుగా 66 మందిని ఎంపిక చేశామన్నారు. మిగతా ఉపాధ్యాయులంతా తమ వృత్తిలో బాగా పనిచేస్తున్న వారేనన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ఎల్‌వీ గిరి రాజ్‌గౌడ్, ఎంఈఓలు నెహ్రూ, మనోజ్‌కుమార్, జి ల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్‌మోహన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ బి. మహేష్, ఏసీజీఈ మధుసూదన్‌రావు, సీఎంఓ సుమాదేవి, జీసీడీఓ సునీత, డీసీఈబీ సెక్రటరీ శైలజ పాల్గొన్నారు . ఉపాధ్యాయుడు డాక్టర్ వల్సపైడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పీఎంశ్రీ ప్రభుత్వ ప్రాక్టిసింగ్ హైస్కూల్ విద్యార్థినులు స్వాగత నృత్యం చేశారు.
అవార్డుల ప్రదానోత్సవానికి రాని
ప్రజాప్రతినిధులు
అవార్డుల ప్రదానోత్సవవాకి ఈసారి ప్రజాప్రతినిధులెవరూ రాలేదు. కలెక్టర్, డీఈఓ కలిసి అవార్డులు ప్రదానం చేశారు. చివరగా గ్రూప్ ఫొటో దిగే సమయంలో కలెక్టర్ వెళ్లి పోయారు. దీంతో టీచర్లు కొంత అసంతృప్తికి లోనయ్యారు.
హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు
అవార్డుల ప్రదానం


