ముమ్మరంగా పునర్నిర్మాణ పనులు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా పునర్నిర్మాణ పనులు

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

కాళేశ్వరం : మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం విజయగణపతి ఆలయం స్టోన్‌తో పునాది నిర్మాణం చేపట్టగా దాన్ని ఆనుకొని ప్రాకార మండపాలకు పిల్లర్స్‌ కోసం రాడ్స్‌ అమర్చుతున్నారు. మరో వైపు ప్రధానమైన ద్విలింగాల గర్భగుడి నిర్మాణానికి నాలుగు పిల్లర్లకు ముగ్గుపోశారు. శ్రీశుభానందాదేవి (పార్వతి)అమ్మవారి ఆలయానికి 12ఫీట్ల లోతు నుంచి నిర్మాణం చేయడానికి కాంక్రీటు ప్రారంభించారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా, ఇతరులు లోపలికి రాకుండా చుట్టూ రేకులతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో రాత్రిపగలు పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement