విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాటం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాటం

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాటం

హన్మకొండ : విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరిలో భాగంగా విద్యార్థులు, యువకుల సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం, యువత విభాగం ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి సుబేదారిలోని కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు, యువకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలను బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభ్యులు బలంగా ప్రస్తావిస్తారన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు కొన్ని కళాశాలల్లో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇలాంటి చర్యలను బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కార్యక్రమంలో దివ్యాంకుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, నాయకులు వద్దిరాజు గణేష్‌, దాస్యం విజయ్‌ భాస్కర్‌, జోరిక రమేష్‌, బైరపాక ప్రశాంత్‌, బొల్లికొండ వీరేందర్‌, పోలెపల్లి రామ్మూర్తి, సోదా కిరణ్‌, పున్నం చందర్‌, ఖండేరావు నర్సింహారావు, వినీల్‌ రావు, కేశోజ్‌ ప్రణయ్‌, సుమన్‌, తిరుపతి, వీరస్వామి. రాకేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌

పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement