ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

ధనసరి సీతక్క

ములుగు : బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ప్రజాప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేయలేని అభివృద్ధిని ప్రజా ప్రభుత్వం చేస్తుండడాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకులపై కేటీఆర్‌ విమర్శలు చేసే ముందు తన పార్టీ నేతల రాజకీయ నేపథ్యాన్ని చూసుకోవాలని సూచించారు. దళిత ముఖ్యమంత్రి, ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమి వంటి హామీలను గతంలో బీఆర్‌ఎస్‌ ఇచ్చి నెరవేర్చలేదని విమర్శించారు. రాజకీయాలు మానుకుని హుందాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి న నిధులు విడుదల చేయించడంలో బీజేపీ నాయకులు చిత్తశుద్ధి చూపాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు హుందాగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రజల చేతిలో మరోసారి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, నాయకులు గొల్లపల్లి రాజేందర్‌ గౌడ్‌, పల్లె జయపాల్‌ రెడ్డి, ముసినపల్లి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కాజీపేట–బల్హర్షా మధ్య

ఆటోమెటిక్‌ బ్లాక్‌..

రెండు రైళ్లు రద్దు, నాలుగు పాక్షికంగా..

ఈ నెల 9, 10వ తేదీల్లో చేపట్టనున్న

రైల్వే బ్లాక్‌

కాజీపేట రూరల్‌ : కాజీపేట–బల్హార్షా సెక్షన్ల మధ్య గల జమ్మికుంట, పొత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోమెటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ కమిషనింగ్‌ కోసం చేపట్టే నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ వర్క్స్‌తో ఈనెల 9, 10వ తేదీన పలు రైళ్ల రద్దు, పాక్షికంగా రద్దు, రీషెడ్యూలింగ్‌, రెగ్యులేషన్‌ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వోశ్రీధర్‌ శుక్రవారం తెలిపారు.

10న రద్దయిన రైళ్లు..

ఈ నెల 10వ తేదీన కాజీపేట–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (17003) రైలు, బల్హార్షా–కాజీపేట (17004) రైలును రద్దు చేశారు.

పాక్షికంగా రద్దయిన రైళ్లు..

10వ తేదీన భద్రాచలంరోడ్‌–బల్హార్షా (17033) సింగరేణి వరంగల్‌–బల్హార్షా మధ్య, సిర్పూర్‌టౌన్‌–భద్రాచలంరోడ్‌ (17034) సింగరేణి సిర్పూర్‌టౌన్‌–వరంగల్‌ మధ్య, హైదరాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (17011) ఇంటర్‌సిటీ కాజీపేట–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ మధ్య, సిర్పూర్‌కాగజ్‌నగర్‌–బీదర్‌ (17012) బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ సిర్పూర్‌కాగజ్‌నగర్‌–కాజీపేట మధ్య రద్దు చేశారు.

రీషెడ్యూలింగ్‌ ఆఫ్‌ ట్రైన్స్‌..

10వ తేదీన సికింద్రాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (17233) ఎక్స్‌ప్రెస్‌ గంట, సిర్పూర్‌ టౌన్‌–కరీంనగర్‌ (6777) పుష్‌పుల్‌ గంట, కరీంనగర్‌–బోధన్‌ (67773) పుష్‌పుల్‌ గంట రీషెడ్యూలింగ్‌తో నడవనున్నాయి.

రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రైన్స్‌..

ఈ నెల 9వ తేదీన వరంగల్‌ మీదుగా వెళ్లే దానాపూర్‌–ఎస్‌ఎంవీటీ బెంగళూరు (22365) ఎక్స్‌ప్రెస్‌ 75 నిమిషాలు, ఎస్‌ఎంవీటీ బెంగళూరు–దానాపూర్‌ (22366) ఎక్స్‌ప్రెస్‌ 45 నిమిషాలు, న్యూఢిల్లీ–చైన్నె సెంట్రల్‌ (12622) ఎక్స్‌ప్రెస్‌ 30 నిమిషాలు, ఈ నెల 10న చైన్నె సెంట్రల్‌–ఎంఎంవీడీ కాట్రా (160 31) ఎక్స్‌ప్రెస్‌ 30 నిమిషాలు రెగ్యులేషన్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement