కై లాసయాత్రికుడి గల్లంతు.. | - | Sakshi
Sakshi News home page

కై లాసయాత్రికుడి గల్లంతు..

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

ఖిలా వరంగల్‌ : మామునూరు గ్రామానికి చెందిన డాక్టర్‌ రేగూరి బుచ్చిరెడ్డి కుమారుడు వినయ్‌కుమార్‌ రెడ్డి కై లాస యాత్ర అనంతరం నేపాల్‌–టిబెట్‌ సరిహద్దులో గల్లంతయ్యాడు. మానస సరోవర్‌, కై లాస పర్వత యాత్రను పూర్తి చేసుకుని ఆగస్టు 26న నేపాల్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్‌ పక్రియలో ఉన్న సమయంలో వెనుక నుంచి అకస్మాత్తుగా భారీగా బురదతో కూడిన వరద దూసుకురావడంతో ఆయన గల్లంతయ్యాడు. నేపాల్‌లోని రసువా ప్రాంతంలో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదల నేపథ్యంలో పలు వురు విదేశీయులు గల్లంతయ్యారు. ఈఘటనకు సంబంధించి విడుదలైన గల్లంతైన వారి జాబితాలో రేగూరి వినయ్‌కుమార్‌రెడ్డి పేరు కూడా నమోదైంది. అధికారిక వివరాల ప్రకారం ఆయన వయసు 44 ఏళ్లు కాగా కెనడా పౌరుడిగా పేర్కొన్నారు.

చివరిసారిగా తల్లిదండ్రులతో మాటలు..

కై లాస పర్వత యాత్రలో ఉన్న వినయ్‌కుమార్‌ రెడ్డి ఆగస్టు 24న తన తల్లిదండ్రులతో చివరి సారి మాట్లాడినట్లు కుటుంబీకులు తెలిపారు. కై లాస పర్వతానికి ఉత్తర, దక్షిణ వైపులను చూపిస్తూ వారితో మాట్లాడినట్లు చెప్పారు. ఆతర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవంతో కుటంబంలో ఆందోళన నెలకొంది. కెనడాలో నివసిస్తున్న వినయ్‌కుమార్‌ రెడ్డి.. ఇషా ఫౌండేషన్‌కు చెందిన ఎస్‌–3 బృందంతో కై లాస యాత్రకు వెళ్లాడు. యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ప్రకృతి విపత్తు వినయ్‌కుమార్‌రెడ్డిని కబలించిందనే సమాచారం శుక్రవారం అందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆచూకీ కోసం ఎదురుచూపులు..

వరదల్లో గల్లంతైనప్పటి నుంచి వినయ్‌కుమార్‌ రెడ్డి ఆచూకీ లభించలేదు. అతడు క్షేమంగా బయటపడి తిరిగి వస్తారన్న ఆశతో కుటుంబీకులు ఎదురు చేస్తున్నారు. మరో వైపు నేపాల్‌ అధికారులు గల్లంతైన వారిని గుర్తించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. భారీ వరద ఉధృతికి అనేక ప్రాంతాల్లో రాకపోకలు, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో గాలింపు చర్యలు సవాలుగా మారాయనే సమాచారం తమకు ఆలస్యంగా చేరిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ పేర్కొన్నారు.

వినయ్‌ కుమార్‌రెడ్డి కోసం గాలింపు

నేపాల్‌–టిబెట్‌ సరిహద్దులో

గల్లంతు

సొంతూరు మామునూరు..

కెనడాలో సెటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement