ఖిలా వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కించపరిచేలా ఏఐ సాంకేతికతతో రూపొందించిన చిత్రాన్ని ఎక్స్ (ట్విటర్) వేదికగా సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మహమ్మద్ బాబు అలియాస్ బాబు మియాపై గురువారం రాత్రి కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు మహ్మద్ కమాలుద్దీన్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిందితుడిపై 196,353(2),356 బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ స్వామి తెలిపారు. శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా..రిమాండ్‌కు తరలించకుండా పర్సనల్ బెయిల్‌పై నిందితుడిని విడుదల చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
విడుదల చేయాలని ధర్నా..
తమ పార్టీ కార్యకర్తపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ శుక్రవారం మధ్యాహ్నం మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్యకర్తలు బైఠాయించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం, ప్రజాసమస్యలను ప్రస్తావించడం ప్రతీ ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తపై కేసు.. అరెస్ట్


