వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిగా విఫలమైందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ విమర్శించారు. వెయ్యి రో జుల పాలన వైఫల్యంపై బీఆర్‌ఎస్ చేపట్టిన పోరుబాటలో భాగంగా మూడోరోజు శుక్రవారం అరూరి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ ఆవరణలో వంటావార్పుతో నిరసన చేపట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలను విస్మరించి మోసం చేసిందన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో బొందపెట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్


