● మృతుడు ఏపీ నెల్లూరు జిల్లావాసి
నెక్కొండ: ఎదురుగా వస్తున్న బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ–వరంగల్ ప్రధాన రహదారిలో శుక్రవారం రాత్రి చోటుకుంది. ఏఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ (50) వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లిలో తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. మస్తాన్ నెక్కొండ నుంచి బైక్‌పై వస్తుండగా మార్గమధ్యలోని క్రషర్ మిల్లు వద్ద లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మస్తాన్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఏఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడికి భార్య మస్తానమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.


