వరంగల్ స్పోర్ట్స్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించారు. శాట్ ఆదేశాలతో నిర్వహించిన పోటీలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 150 మంది ఉద్యోగులు హాజరైనట్లు డీవైఎస్‌ఓ ప్రశాంత్ తెలిపారు. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారం, కబడ్డీ, లాన్‌టెన్నిస్, స్విమ్మింగ్, వాలీబాల్, రెజ్లింగ్, ఖోఖో.. ఇలా 19 క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టు కోచ్‌గా రమేశ్
వరంగల్ స్పోర్ట్స్ : బెంగళూరులో ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు జరగను న్న సౌత్‌జోన్ ఇంటర్‌స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగా ణ జట్టు కోచ్‌గా హనుమకొండ డీఎస్‌ఏ కోచ్ కూరపాటి రమేశ్ ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర జట్టుకు కోచ్‌గా ఎంపికై న రమేశ్‌ను హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్, బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి రమేశ్ రెడ్డి, కోశాధికారి నాగ కిషన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అభినందించారు.


