అద్దెకు జిన్నింగ్ మిల్లులు..
ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2026–27 సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగో ళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు జిన్నింగ్ మి ల్లుల్లో బేళ్ల కోసం టెండర్లు పిలిచి పూర్తి చేసింది. గతంలోని ధరలతోపాటు ఇతర నిబంధనలతో ఒకే టెండర్ ప్రకటన ఇచ్చేవారు. ఈ సీజనల్‌లో తొలివిడత ధరల ప్రస్తావన లేకుండా ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని టెండర్ ప్రకటన వచ్చింది. మరో రెండు నెలల్లో పత్తి పంట చే తికొచ్చి క్రయవిక్రయాలు ప్రారంభించే అవకా శం ఉంది. దీంతో వ్యాపారులతోపాటు సీసీఐ ప త్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది
7.24 లక్షల ఎకరాల్లో పత్తిసాగు
ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్‌లో పత్తి సాగు సు మా రు 7.24 లక్షలకు పైగా ఎకరాలకు చేరుకుంది. 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధి కా రులు అంచనా వేశారు. మద్దతు ధరతో కొనుగోలు చేసే సీసీఐ.. బేళ్లుగా మార్చి ఎగుమతి చేయడానికి ఏటా టెండర్లు ఆహ్వానిస్తుంది. అదే తరహాలో టెండర్లను పిలిచింది. గతేడాది 6.53 లక్షల బేళ్లను సిద్ధం చేసి ఎగుమతి చేసింది. ఈ సీజనలో పత్తి క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ములు గు, కేసముద్రం–ఏ, బీ, తొర్రూరు, మహబూబాబాద్, కాటారం, చిట్యాల, భూపాలపల్లి, కొడకండ్ల, నర్సంపేట, జనగామ–ఏ, బీ, ఘన్‌పూర్, ఆత్మకూరు, రాంపూర్, పరకాల, ఎల్కతుర్తి, వరంగల్–ఏ, బీ కేంద్రాలున్నాయి. గత కేంద్రాలను ఈసారీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా రు. కేంద్రాల వారీగా కొనే పత్తిని బేళ్లుగా మార్చేందుకు ఏటా జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుంటున్నారు. జిన్నింగ్ మిల్లులు, గిడ్డంగులు, బేళ్ల రవాణాకు వాహనా లు, తాత్కాలిక ఉద్యోగులు తదితర వాటికి కూడా టెండర్లను ఆహ్వానించినట్లు మార్కెటింగ్ శాఽఖ అధికారులు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెండర్లు పూర్తిచేసిన సీసీఐ
16 మార్కెట్ యార్డుల పరిధిలో
19 కేంద్రాలు ఏర్పాటు
50.25 లక్షల క్వింటాళ్ల
పత్తి వస్తుందని అధికారుల అంచనా


