ప్రయోగాలకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రయోగాలకు ప్రోత్సాహం

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

ప్రయోగాలకు ప్రోత్సాహం

విద్యారణ్యపురి: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ విద్యాసంవత్సరం (2026–27) ఆరంభంలోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని ప్రయోగశాలలకు ఇంటర్‌ బోర్డు ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఈమేరకు ఈవిద్యాసంవత్సరంలో ఇంటర్మీ డియట్‌లో వివిధ సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈసారి ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులతోపాటు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరంలో సైన్స్‌ సబ్జెక్టు ప్రయోగ పరీక్షకు 15 మార్కుల చొప్పున కేటాయించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రయోగశాలలు బలోపేతం చేసేలా పరికరాలు, కెమికల్స్‌ అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం నిధులను ఇంటర్‌బోర్డు మంజూరు చేసింది.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా..

ఈవిద్యా సంవత్సరంలో జూలై 17వ తేదీ వరకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నమోదు అయిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇంటర్‌ బోర్డు నిధులను మంజూరు చేసింది. ఒక్కో జూనియర్‌ కళాశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో కాలేజీకి రూ.24 వేల నుంచి రూ.లక్ష వరకు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి అవసరమైన ప్రాక్టికల్స్‌ నిర్వహణ పరికరాలు, కెమికల్స్‌, ఇతర సామగ్రిని కొనాల్సి ఉంటుంది.

జిల్లాల వారీగా కళాశాలలు,

మంజూరైన నిధులు (రూ.లక్షల్లో)

మొత్తం

కళాశాలలు

నిధులు

5.80

4.64

ప్రభుత్వ కళాశాలల్లోని

ప్రయోగశాలలకు నిధులు మంజూరు

ఉమ్మడి జిల్లాలోని 48 కళాశాలలకు కేటాయింపు

4.80

3.08

2.84

1.84

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement