డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి
హన్మకొండ చౌరస్తా: ప్రజాసేవలో మాజీ సీఎం వైఎస్సార్‌ది చెరగని ముద్ర అని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంట్రాంరెడ్డి అన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో వై ఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈసందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి వైఎస్సార్ అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్‌గౌడ్, బత్తిని శ్రీనివాస్‌రావు, వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, ఐవైసీ జాతీయ కార్యదర్శి గొట్టిముక్కుల సాగరిక, డీసీసీ మీడియా కమిటీ చైర్మన్ మార్క విజయ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


