వరంగల్ చౌరస్తా: నగరంలోని కాశిబుగ్గలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల జాతర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యస్వామి, ముదిరాజ్ సంఘం నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులు రత్నం కృష్ణ కిషోర్, జూలూరి నైనేష్, గొడిశాల కార్తీక్ గౌడ్, కార్యకర్తలు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.


