భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

హన్మకొండ: హనుమకొండ జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ నెమురుగొమ్ముల రవి అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వేపై భూములు కొలతలు శాఖ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు గ్రామాల్లో రెండు సర్వే బృందాలతో 14 రోవర్లతో భూముల రీసర్వే కొనసాగుతుందన్నారు. గ్రామపాలన అధికారులు (జీపీఓలు) సర్వే జరుగుతున్న చోటకు రానట్లయితే సమాచారం ఇవ్వాలన్నారు. భూముల రీసర్వేలో జిల్లాకు, సర్వేయర్లకు మంచి పేరు ఉందని, ఇదే స్ఫూర్తితో రీ సర్వే కొనసాగిస్తూ నవంబర్‌ మాసానికి జిల్లాలోని 70 గ్రామాల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పరకాల ఆర్డీఓ డీఎస్‌.వెంకన్న, భూములు కొలతలు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నూర్‌ సింగ్‌, డీఐలు సారంగపాణి, రాజనర్సయ్య, సర్వేయర్లు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ రవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement