● కర్రతో విచక్షణారహితంగా
కొట్టడంతో తీవ్రగాయాలు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఉనికిచర్ల సమీపంలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం ఓ విద్యార్థిని వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రతో తీవ్రంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమటిపల్లి ప్రాంతంలోని నిరూప్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థి ఉనికిచర్ల సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు అతడిని కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గతంలో విరిగిన కుడిచేయిని పట్టుకుని లాగుతూ దారుణంగా కొట్టాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడు అండర్–14 తైక్వాండో విభాగంలో బ్లాక్‌బెల్ట్ సాధించాడు. సదరు వ్యాయామ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


