సంచార జాతుల సమస్యలకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సంచార జాతుల సమస్యలకు ప్రాధాన్యం

Sep 1 2026 3:12 AM | Updated on Sep 1 2026 3:12 AM

సంచార జాతుల సమస్యలకు ప్రాధాన్యం

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: సంచార జాతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ హామీ ఇచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సంచార జాతుల విముక్తి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు కలెక్టర్‌ చాహత్‌, అదనపు కలెక్టర్‌ రవి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి సహాయ అధికారులు ఎస్‌.లక్ష్మణ్‌, ఆర్‌.సంపూర్ణ, పరిపాలనా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రీసర్వే వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి

హనుమకొండ జిల్లాలో చేపట్టిన భూముల రీ సర్వే వివరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని భూములు, కొలతల శాఖ కార్యాలయంలో జిల్లాలోని 70 గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే వివరాలు సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్న ప్రక్రియను ఆమె పరిశీలించారు. రీసర్వేను ఐదు దశల్లో చేపట్టినట్లు అధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement