మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
హన్మకొండ: కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి చేపట్టనుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై పోరుబాటకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వారం పాటు కాంగ్రెస్ మోసాలపై బీఆర్‌ఎస్ పోరుబాట చేపట్టనుందని వివరించారు. వారం పాటు వినూత్న నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, వద్దిరాజు గణేశ్, పులి రజనీకాంత్, బొంగు అశోక్, సోదా కిరణ్, కమరున్నీసా బేగం, ఇమ్మడి లోహిత, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


