వరంగల్ స్పోర్ట్స్: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను శుక్రవారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ‘ఖేలే గా భారత్ – జీతేగా భారత్’ అనే నినాదంతో 30వ తేదీ వరకు వివిధ క్రీడా, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందుగా మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ కోచ్‌లు నరేందర్, నవీన్, విష్ణువర్దన్, రమేష్, ప్రభుదాస్, వెంకటేశ్వర్లు, సిబ్బంది జ్యోతి, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఇన్‌చార్జ్ నయిం, సిబ్బంది సోనీ, నిఖిత, శైలజ, సంపత్ పాల్గొన్నారు.


