కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌ని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం సెమినార్ హాల్‌లో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్స్ యాక్టివిటీస్ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్ మాట్లాడుతూ నాడు గ్రంథాల్లో అచ్చమైన తెలుగు ఉండాలని గిడుగు రామ్మూర్తి పోరాడారని గుర్తు చేశారు. తెలుగు భాష కమ్మనైనది అనే పాటను ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆలపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సోమశేఖర్, రాజమోహన్, సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.


