అన్నపూర్ణ క్యాంటీన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ క్యాంటీన్‌ తనిఖీ

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

అన్నపూర్ణ క్యాంటీన్‌ తనిఖీ

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో బల్దియా సహకారంతో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని బల్దియాకమిషనర్‌ టి.వెంకన్న శుక్రవారం తనిఖీ చేశారు. భోజనం శుచి, శుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, వడ్డించే విధానం తది తర అంశాలను కమిషనర్‌ ప్రత్యక్షంగా పరిశీలించా రు. రూ.5కే వినియోగదారులకు అందిస్తున్న భోజ నాన్ని స్వయంగా రుచి చూశారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, పేదలు, ఇతరులకు అందుబాటులో ఉండే ఈ సేవలో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ ఉండకూడదని కమిషనర్‌ స్పష్టం చేశారు. కమిషనర్‌ వెంట ఎంహెచ్‌ఓ రాజేష్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement